• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సాయ్‌లో 320 పోస్టులు 

భార‌త ప్ర‌భుత్వ యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 320

1) కోచ్‌: 100

క్రీడా విభాగాలు: ఆర్చ‌రీ, అథ్లెటిక్స్, బాక్సింగ్‌, హాకీ, షూటింగ్‌, వెయిట్‌లిప్టింగ్‌, వ్రెజ్లింగ్‌, సైక్లింగ్‌, రోయింగ్‌, స్విమ్మింగ్‌, ఫుట్‌బాల్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: సాయ్‌, ఎన్ఎస్ ఎన్ఐఎస్‌/ ఇత‌ర గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి కోచింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో ఐదేళ్ల అనుభ‌వం.  ఒలంపిక్‌/ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో మెడ‌ల్ గెలిచి ఉండాలి. ఒలంపిక్‌/ అంత‌ర్జాతీయ ప్ర‌ద‌ర్శ‌న చేసి ఉండాలి. ద్రోణాచార్య అవార్డ్ పొంది ఉండాలి. 

వ‌య‌సు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, సంబంధిత విభాగంలో (స్పోర్ట్స్‌) ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వ‌హిస్తారు. 

2) అసిస్టెంట్ కోచ్: 220

క్రీడా విభాగాలు: ఆర్చ‌రీ, అథ్లెటిక్స్, బాక్సింగ్‌, హాకీ, షూటింగ్‌, వెయిట్‌లిప్టింగ్‌, వ్రెజ్లింగ్‌, సైక్లింగ్‌, రోయింగ్‌, స్విమ్మింగ్‌, ఫుట్‌బాల్ త‌దిత‌రాలు. 

అర్హ‌త‌: సాయ్‌, ఎన్ఎస్ ఎన్ఐఎస్‌/ ఇత‌ర గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి కోచింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. ఒలంపిక్‌/ అంత‌ర్జాతీయ ప్ర‌ద‌ర్శ‌న చేసి ఉండాలి. ద్రోణాచార్య అవార్డ్ పొంది ఉండాలి.

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, సంబంధిత విభాగంలో (స్పోర్ట్స్‌) ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.05.2021.
 

Notification Information

Posted Date: 18-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :