• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్‌బీఐలో 5454 జూనియర్ అసోసియేట్‌ పోస్టులు 

ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) దేశ‌వ్యాప్తంగా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* జూనియ‌ర్ అసోసియేట్‌(క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ అండ్ సేల్స్‌)

* మొత్తం ఖాళీలు: 5454 (జ‌న‌ర‌ల్-5000, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ బ్యాక్‌లాగ్-121, పీడ‌బ్ల్యూడీ-96, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌-237)

* హైద‌రాబాద్ (తెలంగాణ‌): 275

అర్హ‌త‌: ఏదైనా విభాగంలో డిగ్రీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి ఏడాది/ సెమిస్ట‌ర్ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

వ‌య‌సు: 01.04.2021 నాటికి 20-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 02.04.1993 - 01.04.2001 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌(ప్రిలిమిన‌రీ & మెయిన్స్‌), లోక‌ల్ లాంగ్వేజ్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ప‌రీక్షా విధానం:  ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ టెస్ట్ 100 మార్కుల‌కు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వ‌హిస్తారు. ప‌రీక్షా స‌మయం 1 గంట ఉంటుంది. ఇందులో మూడు సెక్ష‌న్లు ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప‌త్రి త‌ప్పు స‌మాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. 

1) ఇంగ్లిష్ లాంగ్వేజ్      30 ప్ర‌శ్న‌లు     30 మార్కులు      20 నిమిషాలు

2) న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ   35 ప్ర‌శ్న‌లు     35 మార్కులు      20 నిమిషాలు

3) రీజ‌నింగ్ ఎబిలిటీ      35 ప్ర‌శ్న‌లు     35 మార్కులు      20 నిమిషాలు

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్స్ ప‌రీక్ష‌కు ఎంపిక చేస్తారు. దీనిలో నాలుగు సెక్ష‌న్లు ఉంటాయి. ఈ ప‌రీక్ష‌ను మొత్తం 200 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ప్ర‌శ్న‌ల సంఖ్య 190, ప‌రీక్షా స‌మ‌యం 2 గంట‌ల 40 నిమిషాలు ఉంటుంది.

1) జ‌న‌ర‌ల్‌/ ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్    50 ప్ర‌శ్న‌లు    50 మార్కులు   35 నిమిషాలు

2) జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్                   40 ప్ర‌శ్న‌లు   40 మార్క‌లు    35 నిమిషాలు

3) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్            50 ప్ర‌శ్న‌లు   50 మార్కులు    45 నిమిషాలు

4) రీజ‌నింగ్ ఎబిలిట్ & కంప్యూట‌ర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్న‌లు 60 మార్కులు  45 నిమిషాలు 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

ముఖ్య‌మైన తేదీలు: 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 27.04.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 17.05.2021.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌: 2021 జూన్.

మెయిన్స్ ప‌రీక్ష తేది: 31.07.2021.

 

ప్రీవియ‌స్ పేప‌ర్లు మోడ‌ల్ పేప‌ర్లు ఇంగ్లిష్‌
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్‌ రీజ‌నింగ్‌ జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌

Notification Information

Posted Date: 27-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :