• facebook
  • twitter
  • whatsapp
  • telegram

యూపీఎస్సీ-ఎన్‌డీఏ & ఎన్ఏ (2) ఎగ్జామ్‌, 2021 

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ)..148వ కోర్సు నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ), 110వ ఇండియ‌న్ నావ‌ల్ అకాడ‌మీ కోర్సుల్లో(ఎన్ఏ) ప్ర‌వేశానికి అవివాహిత‌ పురుష‌ అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ (2) ఎగ్జామ్, 2021

మొత్తం ఖాళీలు: 400

1) నేష‌నల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ): 370 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్ ఫోర్స్‌-120)

2) నావ‌ల్ అకాడ‌మీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌): 30

అర్హ‌త‌: ఆర్మీ వింగ్ పోస్టుల‌కి ఇంట‌ర్మీడియ‌ట్ (10+2)/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.  ఎయిర్ ఫోర్స్‌, నేవ‌ల్ వింగ్స్ పోస్ట‌ల‌కి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ (10+2) ఉత్తీర్ణ‌త‌. ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వ‌య‌సు: 2003 జ‌న‌వ‌రి 2 - 2006 జ‌న‌వ‌రి 1 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. 

ఎంపిక‌: రాత‌పరీక్ష‌, ఎస్ఎస్‌బీ టెస్ట్/ ఇంట‌ర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం, తిరుపతి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ, ప్ర‌క‌ట‌న‌లో సూచించిన అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు. 

ముఖ్య‌మైన తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 09.06.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 29.06.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల ఉప‌సంహ‌ర‌ణ తేది: 2021 జులై 06 నుంచి 12 వ‌ర‌కు.

* ప‌రీక్ష తేది: 05.09.2021.

* కోర్సు ప్రారంభం: 02.07.2022.
 

Notification Information

Posted Date: 09-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :