• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎంజీఎన్‌సీఆర్ఈలో మేనేజ్‌మెంట్ ఇంట‌ర్న్‌షిప్ 

భార‌త ప్ర‌భుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని ఉన్న‌త విద్యా విభాగానికి చెందిన హైద‌రాబాద్‌లోని మ‌హాత్వా గాంధీ నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ రూర‌ల్ ఎడ్యుకేష‌న్‌(ఎంజీఎన్‌సీఆర్ఈ) కింది ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రాంలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 30

* మ‌హాత్మాగాంధీ రూర‌ల్ ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రాం 2021-22 

అర్హ‌త‌: పోస్ట్‌గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌. 

* టీచింగ్ రంగంలో ఉన్న వారికి ప్రాధాన్య‌త ఇస్తారు.

* ఇంగ్లిష్‌, హిందీలో మంచి కమ్యునికేష‌న్ నైపుణ్యాలు ఉండాలి.

* ఫ్రెష‌ర్స్ సైతం ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలుంది.

ఎంపిక విధానం: గ్రామీణ ప్రాంతాల్లో విద్యావిధానంపై క‌నీసం 20 నిమిషాల నిడివి ఉన్న వీడియోను పంపాల్సి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని తుది ఎంపిక ఉంటుంది.

ప్రోగ్రాం వ్య‌వ‌ధి: నాలుగు నెల‌లు.

రెమ్యున‌రేష‌న్‌: నెల‌కు రూ.50000 వ‌ర‌కు చెల్లిస్తారు.

* ప్రోగ్రాం ముగిసిన అనంత‌రం సంబంధిత స‌ర్టిఫికేష‌ట్ జారీ చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* వీడియోను సైతం కింద తెలిపిన ఈమెయిల్‌కు పంపించాల్సి ఉంటుంది.

ఈమెయిల్‌: mgncreinternship@gmail.com

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.05.2021
 

Notification Information

Posted Date: 01-05-2021