• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎల్&టీ బిల్డ్ ఇండియా స్కాల‌ర్‌షిప్

ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న ఎల్&టీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ 2021 సంవ‌త్సరానికి క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఎంటెక్ చ‌దువుతున్న విద్యార్థుల కోసం ఎల్‌&టీ బిల్డ్ ఇండియా స్కాల‌ర్‌షిప్ అందిస్తోంది.

వివ‌రాలు..

* ఎల్‌&టీ బిల్డ్ ఇండియా స్కాల‌ర్‌షిప్ (క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఎంటెక్ చ‌దువుతున్నవారికి) 

అర్హ‌త‌: క‌నీసం 70% మార్కులు/ 7 సీజీపీఏతో 2021లో ఉత్తీర్ణుల‌య్యే కోర్ సివిల్‌/ కోర్ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ విద్యార్థులు అర్హులు.

ఎంపిక విధానం: ‌ఆన్‌లైన్ రాత ప‌రీక్ష (స‌బ్జెక్ట్ & ఆప్టిట్యూడ్ టెస్ట్‌), ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. రిజిస్ట‌ర్ చేసుకున్న అభ్య‌ర్థుల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఆన్‌లైన్ టెస్ట్‌‌కు ఎంపిక చేస్తారు. ఈ ప‌రీక్ష‌ను ఎల్‌&టీ భాగ‌స్వామ్యంతో ఐఐటీ మ‌ద్రాస్‌/ దిల్లీ, ఎన్ఐటీ సుర‌త్క‌ల్‌/ త‌్రిచీ నిర్వ‌హిస్తాయి. తుది ఎంపిక‌కు అర్హులైన వారికి మెడిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది.

స్కాల‌ర్‌షిప్‌: ఈ కోర్సు(ఎంటెక్‌) 24 నెల‌లు ఉంటుంది. నెల‌కు రూ.13400 చొప్పున చెల్లిస్తారు. ఎల్‌&టీ సంబంధిత ఐఐటీ/ ఎన్ఐటీల‌కు స్పాన్స‌ర్‌షిప్ ఫీజు, ట్యూష‌న్ ఫీజు నేరుగా చెల్లిస్తోంది. ఈ కోర్సును విజ‌యవంతంగా పూర్తి చేసిన వారికి ఎల్‌&టీ ఉద్యోగ అవ‌కాశం క‌ల్పిస్తోంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య‌మైన తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.03.2021.

* ఆన్‌లైన్ రాత ప‌రీక్ష తేది: ఏప్రిల్ 2021-జూన్ 2021 మ‌ధ్య‌లో ఉంటుంది.

* ఇంట‌ర్వ్యూ ప్ర‌క్రియ: జూన్ 2021 - జులై 2021 మ‌ధ్య‌లో ఉంటుంది.

* స్పాన్స‌ర్‌షిప్ లెట‌ర్స్ అందించే తేది: 2021 ఆగ‌స్టు మొద‌టి వారం.

నోటిఫికేష‌న్‌: https://www.lntecc.com/homepage/common/build-india-scholarship.html

Notification Information

Posted Date: 09-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :