‘సిచ్యుయేషన్ని బట్టి సింక్ అయిపోవాలి’- ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట! చాలా కంపెనీలు ఉద్యోగ ప్రకటనల్లో ‘క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అడాప్టబిలిటీ స్కిల్ ఇన్ ఎనీ వర్క్ ఎన్విరాన్మెంట్’ అని పేర్కొనడం చూస్తున్నాం. ఈ రెండింటికీ ఉన్న సంబంధమేమిటి? సిచ్యుయేషన్ను బట్టి సింక్ అయిపోవాలన్నా, వర్క్ ఎన్విరాన్మెంట్లో అడాప్టబిలిటీ ఉండాలన్నా ఒక్కటే. సర్దుకుపోవడం. ఇదో కీలకమైన జీవన నైపుణ్యం!
పరిస్థితులపై గట్టి పట్టు సాధిస్తేనే విజయం వరిస్తుంది. కెరియర్లో ఎదగాలనుకునే విద్యార్థులకూ ఈ జీవన నైపుణ్యం ఎంతో అవసరం!
నేటి ఆధునిక కార్పొరేట్ ఐటీ కార్యకలాపాల్లో మల్టీటాస్కింగ్ అనివార్యమవుతోంది. కెరియర్లో ఎదిగేందుకు ఈ నైపుణ్యం సోపానంగా తోడ్పడుతుంది. నిత్యజీవితంలోనూ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు అక్కరకు వస్తోంది. బహువిధాలా ఉపయోగపడే బహుముఖ కార్యదక్షత అలవరచుకోవడమే భవితకు రక్ష!
మన జీవితాల్లో అంతర్భాగమైన గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ల సృష్టి ఏవిధంగా జరిగింది? మన ఓయో, మేక్ మై ట్రిప్, ఓలాల ప్రయాణం ఎలా మొదలైంది?
నీళ్లలో ఎలా ఈదాలో తెలిసుండటం విజ్ఞానం. నిజంగా ఈదగలగడం నైపుణ్యం! ఈ రెండింటిలో ఏది ముఖ్యం? రెండూ అవసరమే.
చీకట్లో నడుస్తున్నపుడు మన వెంట వచ్చే కాగడా లాంటిది- ఫోకస్ (ఏక దృష్టి). ఈ జీవన నైపుణ్యం మన సంకల్పానికి వజ్రాయుధం.