వ్యవసాయం దేశానికి వెన్నెముక లాంటిది. కొన్ని శతాబ్దాలుగా ఇది భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర వహిస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పూలు, కూరగాయలు, పండ్ల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా తర్వాతి స్థానం మనదేశానిదే.